సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా హెయిర్ స్టైల్ లుక్ నెట్టింట్ల తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ సెట్ చేసిన ఈ లుక్ ను నమ్రతా కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ క్రేజీ లుక్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మరి.
Mahesh babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనలోనే కాదు. స్టైల్లో కూడా ఇతన్ని బీట్ చేసే నటుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. అందుకే మహేష్ అమ్మాయిల కలల రాకుమారుడుగా ప్రసిద్ధి పొందాడు. కేవలం సినిమాలే కాకుండా వ్యాపార సంబంధమైన ప్రొడక్ట్స్‌కు కూడా బ్రాండ్ అంబాసీడర్‌గా వ్యవహరిస్తూ పలు యాడ్స్‌లో నటిస్తూంటాడు. ఆయన నటించిన చిత్రాల కన్నా యాడ్స్ ద్వారా పొందే పారితోషికమే ఎక్కవ. ప్రస్తుతం త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో గుంటూరు కారం(Gunturu Karam) సినిమాలో నటిస్తున్నారు. ఆ తరువాత దర్శక దిగ్గజ రాజమౌళి(Rajamouli) కాంబినేషన్లో పాన్ వరల్డ్ మూవీలో నటించనున్నారు.
అయితే తాజాగా మహేష్ బాబు లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్(Aleem Hakeem) సెట్ చేసిన ఎయిర్ స్టైల్‌తో పర్పుల్ కలర్ జాకెట్ ధరించి చాలా హండ్సమ్గా కనిపిస్తున్నారు మహేష్. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టీవ్‌గా ఉండే మహేష్ వైఫ్ నమ్రతా కూడా ఈ ఫోటోలను షేర్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్న ఈ ఫోటోలపై అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు మహేష్ ను హాలీవుడ్ హీరోలతో పోల్చుతుండగా..మరి కొందరూ మాత్రం మహేష్ వయస్సు తగ్గుతుందని కామెంట్లు చేస్తున్నారు.