»The Mangalavaram Movie Release Date Is Finalized On November 17th 2023
Mangalavaram: మంగళవారం విడుదల తేదీ ఖరారు
మంగళవారం సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం నవంబర్ 17న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.
The mangalavaram movie release date is finalized on november 17th 2023
దర్శకుడు అజయ్ భూపతి(ajay bhupathi) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం(mangalavaram)’. ఈ మూవీలో పాయల్ రాజ్పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. విలేజ్ బేస్డ్ యాక్షన్-థ్రిల్లర్ మూవీ అయిన ఈ చిత్రం నవంబర్ 17న థియేటర్లలో రిలీజ్ రానుంది. ఈ చిత్రం తెలుగులో భారీ స్థాయిలో విడుదల కానుంది. అజయ్ భూపతి, అతని సహ నిర్మాతలు స్వాతి గునుపాటి, సురేష్ వర్మ ఎం ఈ చిత్రాన్ని హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల చేయబోతున్నారు.
ముద్రా మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణానంతర పనులను పర్యవేక్షిస్తున్నాయి. “విజువల్ స్టోరీ టెల్లింగ్, పల్లెటూరి సౌందర్యంతో నిండిన మా చిత్రం చాలా విధాలుగా ప్రత్యేకంగా ఉండబోతోందని మేకర్స్ చెప్పారు. మునుపెన్నడూ చూడని సన్నివేశాలను మీరు ఆశించవచ్చని మేకర్స్ అన్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ఫస్ట్ సాంగ్ విడుదలయ్యాయి. అజయ్ ఘోష్, లక్ష్మణ్, చైతన్య కృష్ణ, శ్రీతేజ్ లు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. బి అజనీష్ లోక్నాథ్ (‘కాంతారా’ ఫేమ్ సంగీతం), రియల్ సాయిత్ష్ , పృథ్వీ (ఫైట్స్), దాశరధి శివేంద్ర (సినిమాటోగ్రఫీ) తదితరులు ఈ చిత్రానికి పనిచేశారు. తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్ డైలాగ్స్ రాశారు.