Mangalavaram: ఓపెన్ చేస్తే.. ఉదయించే సూర్యుని నుంచి ఒక అబ్బాయి నడుచుకుంటూ వస్తాడు అతను రవి. తరువాత సీన్లో రవి, శైలూ జామ తోటలో జామ కాయలను దొంగలిస్తారు. తోటమాలి తరుముతుంటే ఇద్దరు పరుగెత్తుకుంటూ వస్తుంటారు. ఇసుక తిన్నల మీద కూర్చొని జామకాయలను పంచుకుంటారు. ఒకటి మిగిలితే ఇది మాలక్ష్మి అమ్మవారికి అని రవి విసిరేస్తాడు. తరువాత వారిద్దరు కలిసి దిగిన ఫోటో ఇస్తాడు. రవి నువ్వు చాలా బాగున్నావు అని శైలజ అంటుంది. రవి మురిసిపోతాడు. శైలజ నీవ్వు ఎందుకు బాలేవో తెలుసా నీ కళ్లకు కాటుక లేదు అని అంటాడు. దాంతో రాత్రి ఒంటరిగా మాలక్ష్మి టెంపుల్ కి వెళ్లి దీపం మసిని తీసుకొచ్చి దాన్ని కాటుకలా చేసినట్లు చెప్తాడు. నెక్ట్స్ వారు ఇంటికి వస్తుంటే కుక్క పిల్ల బావిలో పడి మూలుగుతుంది. దాన్ని కాపాడుతాడు రవి. ఆ కుక్కపిల్లను శైలజ ఇంటికి తీసుకెళ్తా అంటుంది. రవి సరే అంటాడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.
చదవండి:Guntur Kaaram: మహేష్ బాబు.. రుబాబు షురూ!
నెక్ట్స్ సీన్లో శైలు అమ్మ చనిపోవడంతో వాళ్ల నాన్న రెండో పెళ్లి చేసుకుంటాడు. శైలును వాళ్లతో తీసుకెళ్లాలంటే తన పేరు మీదున్న 3 ఎకరాలు తన పేరుమీద రాయమని శైలు అమ్మమ్మతో వాళ్ల నాన్న అంటుంటాడు. అదే సమయంలో శైలు కుక్కపిల్లను తీసుకొని వచ్చి ఒక కుండలో దాచిపెడుతుంది. ఇంటికి వచ్చేసరికి ఎక్కడకు వెళ్లావు అని అడుగుతాడు. ఆ పొలం పిల్లకోసం అని, దాన్ని ఇవ్వను అని శైలు అమ్మమ్మ చెైబుతుంది. అదే సమయంలో అతనికి దగ్గు లేస్తుంది. నీళ్లు అడుగుతాడు. శైలు గ్లాసులో నీళ్లు తీసుకొని వెళ్తుంటే వాళ్ల పిన్ని గ్లాస్ కిందపడేసి ఇక ఇంట్లో ఒక్క క్షణం ఉండొద్దు అని తన కొడుకును, భర్తను తీసుకొని వెళ్తుంది. మాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర శైలు ఏడుస్తుంటే అక్కడి రవి వచ్చి మీ నాన్న కోసం ఏడవడం వేస్ట్ అని ఆ తల్లిని మొక్కుదాం అని దీపం ముట్టిస్తుంటే అక్కడికి రవి నాన్న వచ్చి కొడుతాడు. దాంతో రవి వాళ్ల నాన్నను తిట్టి వెళ్లిపోతాడు. తరువాత రవి తండ్రి శైలుతో ఇంటికి రావడం లేదేంటి అని భుజం నిమురుతూ అడుగుతాడు.
నెక్ట్స్ సీన్లో శైలు మెచ్యుర్ అయిందని ఇంటి దగ్గర ఒక్కర్తే ఉన్నట్లు శైలు నాన్నకు ఫోన్ చేసి చెప్తుంది. దానికి ఆస్తి ఇవ్వడానికి పనికిరాము కానీ అవసరాలకు గుర్తుకు వస్తామా అని తండ్రి అంటాడు. శైలును దగ్గరకు తీసుకొని వాళ్ల అమ్మమ్మ బాధ పడుతుంది. తరువాత రవి ఇళ్లు మంటల్లో కాలిపోతుంటుంది. అక్కడికి శైలు వచ్చి రవి అని బాధ పడుతుంది. తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయారు అని ఊర్లో వారు మాట్లాడుకుంటారు. కట్ చేస్తే పది సంవత్సరాల తరువాత ఆక్టోబర్ 18, 1996 మంగళవారం అర్థరాత్రి అని పడుతుంది. చీకట్లో మంటలతో కళ్లు కనిపిస్తాయి. కుక్క అరుచుకుంటూ పరుగెడుతుంది. మంగళవారం అనే టైటిల్ పడుతుంది.
తెల్లవారుతుంది. ఊర్లో వారు అందరూ పనుల్లో ఉంటారు. ఒక ముసలోడు చుట్ట తాగుతూ.. మిల్లు దగ్గర ఒక గోడను చూస్తూ ఉంటాడు. అక్కడ చాలా మంది గుమిగూడి ఉంటారు. అదే సమయంలో కసిరాజు, పులి ఊర్లోకు వస్తూ అక్కడ మందిని చూసి వెళ్తారు. గోడ మీద రాజుకు, మేరీకి ఉన్న అక్రమ సంబంధం గురించి రాసి ఉంటుంది. అదే సమయంలో అక్కడికి డేనియల్ వచ్చి తనకు చదువురాదు అని చదవవి చెప్పమంటాడు. దాన్ని కసిరాజు చదువుతాడు. దాంతో తన పెళ్లం అక్రమ సంబంధం పెట్టుకుందని కత్తి తీసుకొని చంపడానికి పరుగెత్తుతాడు. కట్ చేస్తే అరటి తోటలో రాజు, మేరీ పురుగుల మందు తాగి చనిపోతారు. ఈ విషయం ఊరంత తెలిసి అందరూ పరుగెత్తుకుంటూ వస్తారు. ఎవరో గోడమీద రాయడం ఏంటి, వీళ్లు పురుగుల మందు తాగి చావడం ఏంటని అందరూ మాట్లాడుకుంటారు. అదే సమయంలో అక్కడి ఎస్ఐ మాయ వస్తుంది. ఒక అతను అలా తోసుకుంటూ పోతున్నావు అని అంటే అతన్ని కొడుతుంది. తరువాత బాడీలను చూస్తుంది. లేడీ ఎస్ఐ బలే ఉందిరా అని కసిరాజు పులితో అంటుంటాడు. రాజు గారు పొగిడినట్లు ఆమెకు చెప్పొస్తా అని పులి అంటే.. ఎస్ఐ కాస్త తేడాగా ఉందిరా… ఇంత ముందే కిట్టుగాడి చెంప పగలగొట్టింది అని అంటాడు. అక్కడ కానిస్టేబుల్ కు పురుగుల మందు డబ్బా దొరుకుతుంది. వాసు కెమెరా మ్యాన్ వచ్చి ఫోటోలు తీస్తుంటాడు. బాడీని పోస్ట్ మర్టానికి పంపించమని ఎస్ఐ అంటుంది. దాంతో గ్రామస్తులు ఒప్పుకోరు. జామిందార్ ప్రకాశం బాబు కు ఒక మాట చెప్పి తీసుకెళ్లాలి అని అంటారు.
నెక్ట్స్ సీన్లో ప్రకాశం బాబు బయటకు వెళ్తూ తన నాన్న ఫోటోకు దండం పెట్టి చెప్పు తీసుకొని కొడుతాడు. ఆస్తంతా తగలబెట్టావు, కేవలం పేరు మాత్రమే మిగిలింది అని అంటుండగా తన భార్య వచ్చి ఆరతి ఇస్తే దాన్ని ఊది నేను దేవున్ని నమ్మని చెప్పి కార్లో వెళ్లిపోతాడు. తాగుతుంటాడు. తూలుతూ అరటితోటలోకి వెళ్లి పోస్ట్ మర్టం చేయడానికి వీలు లేదు అని చెప్పి వెళ్తాడు. తరువాత మేరీని పూడ్చిపెడుతారు. రాజును కాల్చేస్తారు. అక్కడ కాటికాపరి మాస్క్ పెట్టుకొని ఉంటాడు.
తరువాత సీన్లో కసిరాజు నాగమనితో పులిహోర మాటలు మాట్లాడుతుండగా అక్కడికి పులి వస్తాడు. కసిరాజును చూశావా అంటే లేడని చెప్పమంటాడు కసిరాజు. దాంతో కసిరాజును తిడుతాడు పులి. నన్నే తిడుతావా అని రాజు పులి మెడపట్టుకుంటాడు. అక్కడికి డాక్టర్ వస్తాడు. కసిరాజు లేచి దండం పెడుతాడు. డాక్టర్ చాలా మంచోడు అని మాట్లాడుకుంటారు. డాక్టర్ ఒక పాపకు కామెర్లు ముదిరిపోయాయని చెప్పి, పెద్ద ఆసుపత్రిలో చూపించండి అంటాడు. వాళ్లకు డబ్బులు కూడా ఇస్తాడు. తరువాత సీన్లో గోవిందయ్య ఇంట్లో ఫంక్షన్ ఉందని గురిజ ఇంటికి వెళ్లి చెప్పాలని నాని, తన ఫ్రెండ్ గురిజ ఇంటికి వెళ్తారు. ఇంట్లో ఎవరన్నా ఉన్నారా అని అడుగుతాడు నాని. ఎవరు లేరిని చెప్తుంది గురిజ చెల్లెలు. దాంతో అతను గురిజ చెల్లిలోతో సరసాలు ఆడుతుంటాడు. అదే సమయంలో గురిజ బైక్ సౌండ్ వస్తుంది. నాని బయటకు వస్తుంటే నువ్వేంట్రా ఇక్కడ అని అని గురిజ అంటే గోవిందయ్య ఇంట్లో ఫంక్షన్ భోజనాలకు పిలవమన్నారు అని చెప్పి వెళ్తాడు.
తరువాత గోవిందయ్య ఇంట్లో ఫంక్షన్ ఏర్పాట్లు జరుగుతాయి. భోజనాలు రెడీ అవుతుంటాయి. అందరు భోజనాలకు కూర్చుంటారు. కసిరాజు, పులి తింటుంటారు. అక్కడే గురిజ తన గ్యాంగ్ తో మాట్లాడుకుంటారు. గోడమీద రాసింది వాసు అని మాట్లాడుకుంటుంటే నాని వింటాడు. వాసుతో నాని ఈ విషయం చెప్తాడు. వాసు కోపంతో గురిజను తన్నుతాడు. ఇద్దరి మధ్య గొడువ పెద్దదవుతుంది. బంతిలో ఉన్న వారు కూడా గొడవ పెట్టుకుంటారు. ఫంక్షన్ మొత్తం కొట్టుకుంటునే ఉంటారు. గోవిందయ్య వచ్చి ఆపండ్రా, ఆపండ్రా అని అరుస్తుంటాడు. అదే సమయంలో జమిందారి గారి కారు వస్తుందని ఒకడు అరిచి చెప్తాడు. దాంతో అన్ని సర్ది ఫోటో తీసుకుంటారు. జమిందారి వైఫ్ రిజేశ్వరీ వెళ్లిపోగానే మళ్లీ ఫైట్ చేసుకుంటారు. దీంతో గోవిందయ్య కోపంతో వాసు, గురిజల మీద అరుస్తాడు. అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు.
తరువాతి సీన్లో ఏదో గొడవ జరిగిందంటగా అని పూజరమ్మ అంటే అందుకే కదా రెండు సంవత్సరాల నుంచి జాతర జరగడం లేదని పూజారి అంటాడు. జమీందారితో మాట్లాడుతా అని అంటాడు. తరువాత సీన్లో జమీందారి పిట్టను గురిపెట్టి కొడుతాడు. గురి మిస్ అవుతుంది. అక్కడికి పూజారి వచ్చి జాతరకు డబ్బులు అడిగితే జామీందారి దేవుడిని నమ్మడు కాబట్టి తిట్టి పంపించేస్తాడు. పూజారి బాధ పడి వెళ్లిపోతుంటే రాజేశ్వరీ పూజారని పిలిచి ఆయనేదో కోపంలో ఉండి ఉంటాడు అని డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. తరువాత సీన్లో పూజారికి డబ్బులు ఎందుకు ఇచ్చావు అని భార్యను అడుగుతాడు. వాళ్లు మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు ఇస్తే తప్పేమి లేదు అంటుంది. అయినా దేవుడి నమ్మకుండా మీలా ధైర్యంగా ఉండడం అందరికి సాధ్యం కాదు అంటుంది.
నెక్ట్స్ సీన్లో ఎస్ఐ మాయ జీపులో వెళ్తూ.. ఇంకా ఫోటోలు రాలేదంటని కానిస్టేబుల్ అయ్యప్పను అడుగుతుంటే వాసుకు చెప్పాను మేడమ్ రేపు సాయంత్రం కల్లా ఇచ్చేస్తా అన్నాడు అంటాడు. అదే సమయంలో అరటి తోటలో మాస్క్ పెట్టుకున్న కాటి కాపరి కనిపిస్తాడు. మాయ భయపడి బండి ఆపు అని అంటుంది. బండి ఆపగానే తనకోసం తోటలో చూస్తుంది. అదేం లేదని అక్కడ నుంచి బయలు దేరుతారు. జాతర వచ్చే మంగళవారం అని మాట్లాడుకుంటారు. జాతరకు అంతా ముస్తాబు అవుతుంది. గణగణమోగాలిరా సాంగ్ మొదలౌతుంది. అందరూ డ్యాన్స్ చేస్తుంటారు. ఎస్ఐ మాయ జాతరకు వస్తుంది. మాస్క్ పెట్టుకున్న అతను ఊరి చివర డ్యాన్స్ చేస్తుంటాడు. అదే జాతరలో నాగమణి, కృష్ణ ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఆ జాతరకు జామీందారి భార్య కూడా ముడుపుతో వస్తుంది. జాతర ముగుస్తుంది. ఆ రాత్రి ఒక కుక్క వీధిలో పరుగెడుతుంది. అమ్మవారు వేషం కట్టుకున్న ఒక అవిడ తోటలోకి పరుగెత్తుతుంది.
తరువాత రోజు తెల్లవారు జామున ఒక అతను పాల క్యాన్ తీసుకొని వస్తుండగా ఏదో చూసి భయపడిపోతాడు. అదే సమయంలో గోడమీద పేర్లు రాశారని అందరూ పరుగెత్తుకుంటూ వస్తారు. గోడమీద నాగమణి, కృష్ణ అక్రమ సంబంధం గురించి రాసి ఉంటుంది. తరువాత ఇద్దరు ఒక చెట్టుకు ఉరి తీయబడి ఉంటారు. ఎస్ఐ మాయ, ఊరంత అక్కడే ఉంటారు. డెడ్ బాడీలు కిందకి దించుతారు. చనిపోయిన ఇద్దరు గురిజ ఫ్రెండ్స్ అని అంటుంది. తరువాత వాసు దగ్గరకు వచ్చి వీళ్లకు నీకు ఏదో గొడవ అటా.. నువ్వే చేస్తున్నవా అని అంటుంది. అదే సమయంలో అక్కడి ప్రకాశం వస్తాడు. ఎదురుగా వస్తున్న అతన్ని తన్ని బాడీలను చూస్తాడు. ఇవి పక్క మర్డర్లు అని, చంపేవాడు మన మధ్యే ఉండి ఉంటాడు అని మాయ చెప్తుంది. నాని, వాసు అనుమానంగా చూస్తారు. ఇది హత్యే అని మాయ అంటే ఇలా మాట్లాడకు అని ప్రకాశం అంటాడు. బాడీలను పోస్ట్ మర్టంకు పంపమని చెప్తుంది.
తరువాత సీన్లో అక్రమ సంబంధాలు గురించి ఇలా గోడల మీద రాయడం ఏంటని, పూడ్చిపెట్టిన మేరీ శవం కూడా మాయం చేశాడు అని ఈ ఊర్లో అందరూ అనుమానంగానే ఉన్నారు అని అయ్యప్పతో చెప్తుంది. నెక్ట్స్ సీన్లో గ్రామంలో అందరూ గుమిగూడి ఉంటారు. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గోవిందయ్య చెప్తాడు. శాంతి చేయిస్తేనే ఊరు బాగుపడుతుందని పూజారి చెప్తాడు. ప్రతి మంగళవారం ఇలాంటి చావులు జరుగుతున్నాయని, రేపు మంగళవారం కాబట్టి ఈ రోజు రాత్రి పట్టుకుందాం అని నిర్ణయించుకుంటారు. అక్కడికి అయ్యప్ప వచ్చి మాయ మేడమ్ చాలా సీరియస్ గా ఉందని చెప్తాడు. దానికి మాయ మీదనే డౌట్ ఉందని గ్రామస్తులు అంటారు. తరువాత గ్రామంలో జరుగుతున్న హత్యల గురించి చెప్తూ.. రాత్రి ఎవరు ఇల్లు కదలొద్దు అని పులి చాటింపు చేస్తాడు.
నెక్ట్స్ సీన్లో గురిజ తన గ్యాంగ్ తో వెతుకుతుంటాడు. పులి, కసి రాజు కూడా వెతుకుతుంటాడు. అదే సమయంలో వాసు బైక్ మీద వస్తుంటాడు. తోటలో ఎవరో పరుగెడుతుంటారు. ఒక అతను దీపం పెట్టుకొని వచ్చి గోడమీద రాస్తుంటే గ్రామస్తులు చూస్తారు. అతని వెంట పడుతారు. అతను తప్పించుకొని తోటలోకి పరుగెడుతాడు. అదే సమయంలో డాక్టర్ బస్సు దిగి ఊర్లోకి వస్తాడు. తనకు ఒక ఏడుపు సౌండ్ వినిపిస్తుంది. అతను వెతుక్కుంటూ అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో అతని కోసం గురిజ తన ఫ్రెండ్స్ తో పరుగెతుంటాడు. చివరికి ఒక వాగులో దూకి ఈదుకుంటూ ఒడ్డు చేరగానే అక్కడ గురిజ తన మనుషులతో ఉండి ముసుగు తీస్తే నాని ఉంటాడు. అరే నానిగా నువ్వా అని అతన్ని కొడుతాడు గురిజ.
తరువాత సీన్లో డాక్టర్ ఏడుస్తున్న అవిడ దగ్గరకు వెళ్తాడు. బావి మీద ఒక లేడి కూర్చొని ఉంటుంది. డాక్టర్ ను చూసి బావిలో దూకుతుంది. డాక్టర్ శైలజా అని అంటాడు. కట్ చేస్తే శైలజ కళ్లకు కాటుక పెట్టుకొని రెడీ అవుతుంది. 18 నెలల క్రితం అని టైటిల్ పడుతుంది. శైలజకు వాళ్ల అమ్మమ్మ బాక్స్ పెట్టి ఇస్తుంది. తన కుక్కను పలకరించి వెళ్తుంది. వీధెంట నడుచుకుంటూ వెళ్తుంటే ఒకడు తననే చూస్తాడు. కాలేజీకి వెళ్లి ఒక బైక్ ను చూసి ఎగ్జైట్ అయ్యి బైక్ ను టచ్ చేసి వెళ్తుంది. తరువాత తనతో లెక్చరర్ నీతో క్లోజ్ గా ఉండడానికి కారణం నువ్వు అందంగా ఉంటాడు, బాగా చదువుతావు అని అంటాడు. తాను సిగ్గుపడి వెళ్లిపోతుంది. గోడకు దాక్కొని సిగ్గుపడుతుంది. తరువాత సీన్లో మధన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తాను పర్సు పడేసుకోవడం, తనకు తిరిగి ఇవ్వడం తాను లెక్చరర్ అని తెలియడం, మధన్ శైలునే చూడడం చూసి శైలు ఎక్సైట్ అవుతుంది. అలాంటి సమయంలో బట్టర్ ఫ్లై ఎగురుతుంది.
నెక్ట్స్ సీన్లో వర్షం పడుతుంటే శైలు పాయసం తీసుకొని వస్తుంది. దాన్ని తిని చాలా బాగుందని చెప్తాడు మధన్. వెళ్తా అంటే వర్షంలో ఎక్కడికి వెళ్తావు అని కూర్చో అంటాడు. తరువాత మధన్ షేక్ స్పీయర్ బుక్ తీసుకొని రొమాంటిక్ గా చదువుతూ.. తనను ముద్దుపెట్టుకుంటాడు. అదే సమయంలో ఉరుము సౌండ్ వచ్చి శైలు వెళ్లిపోతుంది. మధన్ డోర్ వేసుకుంటాడు. శైలు ఆలోచిస్తుంది. మధన్ డోర్ తీస్తే బయట శైలు ఉంటుంది. పాట స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఫిజికల్ గా దగ్గరవుతారు. వాళ్ల నాన్న వచ్చిన పట్టించుకోకుండా వెళ్తుతుంది. మధన్ తో హ్యాపిగా ఉంటుంది. శైలును వీధిలో ఒకడు అలానే చూస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ చాలా దూరం వెళ్తుంది. కట్ చేస్తే పాట అయి పోయిన తరువాత ఇంగ్లీష్ టీచర్ రావట్లేదని చెప్తాడు. అతను ఇంటికి కూడా లాక్ వేసి ఉంటుంది. స్టూడెంట్స్ అంతా స్టాఫ్ రూమ్ లో చూస్తుంటే శైలు వెళ్లి చూస్తుంది. మధన్ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు అందరూ కంగ్రాట్స్ చెబుతుంటారు. అది చూసి శైలజ బాధపడుతుంది.
మరో సీన్లో మధన్ తన వైఫ్ ను కార్లో దింపి, శైలుతో మాట్లాడడానికి వస్తాడు. అవకాశం వచ్చింది ఇద్దరం ఎంజాయ్ చేశాము అని చెప్పి వెళ్లిపోతాడు. శైలజ ఏడుస్తుంది. ఇంటికి వస్తే అమ్మమ్మ చనిపోయి ఉంటుంది. కట్ చేస్తే వాళ్ల నాన్న ఇంటికి వచ్చి ఆస్తి రాసిస్తే సరి లేదంటే ఎవరి దారి వాళ్లది అంటాడు. శైలు కోపంతో ఆస్తి పేపర్లు విసిరేస్తుంది. దాంతో పేపర్లు తీసుకొని పిన్ని, తన తండ్రి వెళ్లిపోతారు. తాను ఒంటిరిది అవుతుంది. మధన్ గురించి ఆలోచిస్తుంది. అదే సమయంలో తనకు ఒకడు మధన్ లా కనిపిస్తాడు. వాడితో కమిట్ అవుతుంది. తరువాత తానుకు ఫీలింగ్స్ వచ్చినప్పుడల్లా మధన్ లా ఊహించుకుంటుంది. అదే సమయంలో ముసలి వాడు కూడా విజిల్ వేస్తాడు. తనను చూసి గ్రామంలో కుర్రాల్లు అదోలా చూస్తుంటారు.
రాజు, మేరితో ఉంటూ శైలజను చూస్తాడు, కసిరాజు శైలజ గురించి తప్పుగా మాట్లాడుతాడు. వాసు దగ్గరకు వచ్చి ఫోటో తీసుకుంటుంది. కట్ చేస్తే శైలజ బస్సులో వెళ్తుంటే ఒక అతను తనకు తగులుతాడు. దాంతో తను అబ్ నార్మల్ గా బిహేవ్ చేస్తుంది. అలా అయినప్పుడల్లా తన చేతికి రబ్బరు బ్యాండ్ తో కొట్టుకుంటుంది. కట్ చేస్తే తాను పనిచేసే చోట జమ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్ ను ఎంజాయ్ చేయమని శైలు దగ్గరకు తీసుకొస్తాడు. తను రెఫ్యూజ్ చేస్తుంది. దాంతో జమ వచ్చి తనను బయటకు వెళ్లగొడుతాడు. అదే సమయంలో చనిపోదాం అనుకుంటుంది. ధైర్యం సరిపోక బ్రిడ్జి మీద కూర్చొని ఏడుస్తుంది. మరో సీన్లో తన ఫ్రెండ్ ను ఇంటికి పిలుస్తుంది. కొరడాతో కొట్టమని చెప్తుంది. తాను కొడుతాడు. మీద చేయి వేయగానే గట్టిగా అరుస్తుంది. అతను వెళ్లిపోతాడు. తరువాత శైలు ఏడుస్తుంటే బట్టర్ ఫ్లై వస్తుంది. దాన్ని వెళ్లగొట్టగానే చాలా బట్టర్ ఫ్లైస్ వస్తాయి వాటిని వెలగొడుతూ ఏడుస్తుంది.
తరువాత తాను ఒంటరిగా నడుచుకుంటూ పోతుంది. సాంగ్ స్టార్ట్ అవుతుంది. తనకు ఫీలింగ్స్ వచ్చినప్పుడల్లా అబ్ నార్మల్ గా ఫీల్ అవుతుంది. అలాంటి సమయంలో తాను ఎవరితో ఉంటుందో అనేది గుర్తించకుండా తన వాంఛ తీర్చుకుంటుంది. తనను ఊర్లో వాళ్లు చూసి తప్పుగా అనుకుంటారు. మీనాక్షి టెంపుల్ దగ్గర కూర్చొని రబ్బర్ బ్యాండ్ తో కొట్టుకుంటుంది. కట్ చేస్తే శైలజ బరితెగించి తిరుగుతుంది అని ప్రకాశంతో చెబితే తనను తీసుకురా అంటాడు. తరువాత సీన్లో శైలజ రెడీ అవుతుంటే రాజు, క్రిష్ణ వచ్చి ప్రకాశం తీసుకురా అన్నాడు అని తన జుట్టు పట్టుకొని లాక్కొస్తారు. ప్రకాశం ఇంటి ముందు పడేసి అందరూ తిడుతారు. ఎంత తిట్టినా ఏం చెప్పదు దాంతో నీ లాంటిది ఉండాల్సింది ఊరు మధ్యలో కాదు ఊరు చివర్లో అని చెప్తాడు. దాంతో శైలజను తిట్టుకుంటా ఊర్లోనుంచి బయటను నెట్టేస్తారు. వాసు చూసి కిమ్మనడు. ఊరంతా రాళ్లతో, కర్రలతో కొట్టుకుంటూ ఊరి చివరికి తరిమేస్తారు. శైలజ ఏడ్చుకుంటూ వెళ్తుంది. కట్ చేస్తే శైలజ బావిలో దూకి చనిపోతుంది. అక్కడికి డాక్టర్ వస్తాడు. గోవిందయ్య పాడకంటండి అంటే తన పాడే ఎవరు మోయరు అని క్రిష్ణ అంటాడు.
ప్రస్తుతం టైటిల్ పడుతుంది. మాయ స్టేషన్ ను వస్తుంది. నాని అక్కడే ఉండి నాకు చావులకు ఏలాంటి సంబంధం లేదు, నేను గురిజ చెల్లెలు ప్రేమించుకుంటున్నాము అని, ఇలా గోడల మీద రాస్తే మా విషయం తెలసి నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు అని రాద్దాం అనుకున్నా అని చెప్తాడు. దాంతో అయ్పప్ప తనను నోరుముస్కో అని చెప్తాడు. తరువాత పోస్ట్ రిపోర్ట్ వచ్చాయని ఇస్తాడు. తాను చదువుతుంది. రిపోర్ట్ లో ఏముందని అని అడిగితే గోడల మీద రాసేది వీడు కాదు అంటుంది. ఆ డాక్టర్ కు శైలు దెయ్యం అయి కనిపించినప్పటి నుంచి ఊరంతా ఒకటే గోలగా ఉందని అంటాడు. రేపే చివరి మంగళవారం అని మాయ అంటుంది. అప్పడప్పడ తాండ్ర సాంగ్ స్టార్ట్ అవుతుంది.
తరువాత సీన్లో నాని గాన్ని అనవసరంగా పోలీసులుకు అప్పగించావు అని వాడు కదా అని మాట్లాడుకుంటారు. వాడు కాదని గురిజ అంటాడు. ఈ రోజు అసైలైనవాన్ని పట్టుకోవాలని అంటాడు. అదే రోజు రాత్రి గ్రామస్తులు అంతా వెతుకుతుంటారు. ఎస్ఐ మాయ ఎదో ప్లాన్ చేస్తుంది. ప్రకాశం కూడా కార్లో వెతుకుతుంటాడు. తోటలో అమ్మవారి గెటప్ లో ఎవరో పరుగెత్తుతారు. గ్రామస్తులు అందరూ వెతుకుతుంటారు. కిట్టిగానికి తోటలో అమ్మవారు గెటప్ కనిపిస్తుంది. దాంతో అతను భయపడి పరుగెడుతాడు. మరో సీన్లో అమ్మవారి జాతరలో భాగంగా అమ్మవారి గెటప్ వేసి ఇలా చెరువలో కలషం వేయడం మన సాంప్రదాయం అని పూజారి అంటాడు. అదే సమయంలో కిట్టు గాడు తను చూసింది మా లక్ష్మి అమ్మవారని అని చెప్తాడు. గ్రామస్తులు నమ్మరు. అతన్ని పరుగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్తాడు. అదే సమయంలో ఊర్లో నుంచి అరుపు వినిపిస్తుంది. అందరూ పరుగెత్తుకుంటూ వెళ్తారు.
అక్కడ పులిరాజకు ఏడ్స్ వస్తుందా అని రాసి ఉంటుంది. అది చూసి అందరూ డేనియల్ ను తిడుతారు. గురిజ అరిచి మనల్ని ఇలా ఊరు చివరికి తీసుకొచ్చారు అంటే ఊర్లో ఏదో జరుగబోతుంది అని అనుకొని పరుగెడుతారు. గ్రామంలో ఒక గోడమీద డాక్టర్ రాస్తుంటే అక్కడికి ఎస్ఐ మాయ వస్తుంది. ఇన్నాళ్లు ఇదంతా చేసేది నువ్వా అని క్లాప్స్ కొడుతుంది. లేని దయ్యాన్ని సృష్టించి ఊర్లో వాళ్లను భలే భయపెట్టావు అని అంటుంది. అందరికి చెప్తా అని తనను ఎటాక్ చేస్తుంది. అదే సమయంలో డాక్టర్ మాయకు మత్తు ఇంజక్షన్ ఇస్తాడు. వాసు బైక్ వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. కట్ చేస్తే మాయను డాక్టర్ తన ఇంట్లో కట్టేస్తాడు. ఇదంతా ఎందుకు చేశావు అంటే శైలజ కోసం అని అంటాడు. దానికి మాయ.. మీ ఎఫైర్ గురించి నాకు ముందే తెలుసు, తన కోసమే ఇదంతా చేస్తున్నావా అని అడుగుతుంది. తన గురించి అలా తప్పుగా మాట్లాడితే బాగుండదని అంటాడు. ఒక రోజు తాను తీవ్రమైన గాయాలతో రోడ్డు మీద దోరికిందని, తనను క్లినిక్ తీసుకొస్తే తనకు బతకాలని లేదని చెప్తుంది. తరువాత తన ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని బ్లడ్ సాంపిల్స్ తీసుకొని హాస్పటల్ లో చెక్ చేస్తాడు.
తాను హైపర్ సెక్స్ వల్ డిజార్డర్ తో బాధ పడుతుందని, ఇలాంటి వారికి సాధారణ అమ్మాయిలకంటే ఎక్కువ సెక్స్ వల్ హర్మోన్స్ రిలీజ్ అవుతాయని డాక్టర్ చెప్తుంది. ఇది లైంగిక రుగ్మత అని దీనికి మెడిసిన్ లేదని, కేవలం కేరింగ్ తో కంట్రోల్ చేయవచ్చు అని చెప్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్ ఎక్కవగా చైల్డ్ అబ్యూస్, ఒంటరి తనం వలన వస్తాయి అని చెబుతుంది. దాంతో డాక్టర్ శైలును జాగ్రత్తగా చూసుకుంటాడు. తన కూతురుకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే తన సమస్య ఏంటో చెప్పకుండా ఆత్మహత్య చేసుకుందని, శైలజలో తన కూతుర్ని చూసుకున్నా మాయకు చెప్తాడు. అదే సమయంలో శైలజ మూడీగా కూర్చుంటుంది. ఏం జరిగింది ఎవరన్నా ఏమన్నా అన్నారా అంటే తనకు బతకాలని లేదని చెప్తుంది. మరో సీన్లో వాసు వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తే అక్కడ అమ్మావారి బొమ్మతో ఒకడు కనిపిస్తాడు. ఇద్దరు కొట్టుకుంటారు. వాసు అతన్ని కొడుతాడు. అతను వాసును కొడుతాడు. ఆ బొమ్మ కింద పడుతుంది. దాన్ని మళ్లీ పెట్టుకొని మళ్లీ ఫైటింగ్ చేస్తాడు. అతన్ని వాసు కత్తితో పొడుస్తాడు. అదే సమయంలో కుక్క వచ్చి కాపాడుతుంది. తరువాత మాలక్ష్మి బొమ్మ పెట్టుకున్న అతను త్రిషులంతో పొడిచేస్తాడు. ఎవరు అతను అని మాయ అంటుంది. నువ్వు ఎవడురా అని వాసు అంటాడు. తరువాత డాక్టర్ అతన్ని అడుగుతాడు.
తరువాత సీన్లో శైలజకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, తీయ్యడానికైనా ఒకడు ఉన్నాడని చెప్తాడు. దాంతో శైలజ ఆశ్చర్యంతో చూస్తుంది. అడవిలో రవి ముసుగు తీస్తాడు. ఇక్కడ రవి వచ్చి తనకు కాటుక ఇచ్చి చిన్నప్పుడు చెప్పిన డైలాగ్ చెప్తాడు. దాంతో రవిని పట్టుకొని ఏడుస్తుంది శైలజ. కట్ చేస్తే రవి వాళ్ల నాన్న చిన్నప్పుడు శైలజతో మిస్ బిహేవ్ చేస్తుంటే అక్కడికి రవి వస్తాడు. అతన్ని పట్టుకొని శైలజ ఏడ్చి తాను వెళ్లిపోతుంది. దాంతో కోపం పెంచుకున్న రవి బండతో వాళ్ల నాన్నను చంపేసి గుడిసే తగలబెట్టి వెళ్తాడు. ఆ క్రమంలో తన ఫేస్ కూడా కాలిపోతుంది. ఇద్దరు చనిపోయారని ఊర్లో అందరూ అనుకుంటారు. తరువాత రవి మాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర కూర్చొని ఏడుస్తాడు. అక్కడికి మాస్క్ వస్తుంది. దాన్ని ఫేస్ కు పెట్టుకుంటాడు. తరువాత శైలజనే ఫాలో అవుతున్నట్లు చెప్తాడు. మధన్ తో హ్యప్పిగా ఉందని అనుకుంటాడు. తరువాత తాను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తన వెనుకాలె ఉన్నట్లు చెప్తాడు. కానీ కనిపించే ధైర్యం చేయలేదని చెప్తాడు. శైలజ సంతోషపడుతుంది. తనను పెళ్లి చేసుకో అని అంటే తాను పెళ్లికి పనికి రాను అంటుంది శైలజ. మలినమైంది నీ శరీరం కావచ్చు కానీ నీ మనసు కాదు అని చెప్పి పెళ్లికి ఒప్పిస్తాడు. అదే సమయంలో డాక్టర్, రవి సిటీకి వెళ్లి బట్టలు కొందామని వెళ్లి వస్తారు. శైలజ ఆత్మ హత్య చేసుకుందని ఊర్లో వాళ్లు చెప్పడంతో బట్టలు కిందపడేసి అక్కడికి వెళ్తారు. అక్కడే రవి ఉంటాడు. ఊరు వాళ్లందరూ వెళ్లిన తరువాత శైలజ శవాన్ని పట్టుకొని రవి ఏడుస్తుంటాడు.
ఇదే విషయాన్ని మాయకు చెబితే తాను ఆత్మహత్య చేసుకుంటే ఊరివాళ్లను ఎందుకు చంపుతున్నారు అని అరుస్తుంది. శైలజ ఆత్మహత్య చేసుకోలేదు. తనను హత్య చేశారు అని అంటాడు. అక్కడే ఇంటి బయట ప్రకాశం ఉండీ ఇదంతా వింటాడు. మొత్తం ఆరుగురు. ఇప్పటికే నలుగురిని వేటాడి వెంటాడి చంపేశాము అని చెప్తాడు. ఐదోవాడిని రవి చంపేసి ఉంటాడు అని చెప్తాడు. వాడే ఫోటో గ్రాఫర్ వాసు అంటాడు. కట్ చేస్తే వాసును ఓ గోతిలో పూడ్చేస్తాడు రవి. ఇక ఆరో వ్యక్తి తన చేతులో చనిపోతుందని చెప్తాడు. ఆ ఆరో వ్యక్తి ఎవరు అంటే ఊరంతా దేవలా కొలిచే జమిందారు భార్య రాజేశ్వరి దేవి అని చెప్తాడు. తరువాత సీన్లో జమీందారు ఇంటికి వెళ్తే అక్కడ తన భార్య ఊర్లో ఎవరు పేర్లు రాస్తున్నారో తెలిసిందా అని అడుగుతుంది. ఎందుకు తెలుసుకోవాలని అంతా అత్రంగా ఉందా అని తనను కొడుతాడు. దాంతో తనను కత్తితో పొడుస్తుంది. ఎందుకు చేశావు ఇదంతా అని అడుగుతాడు. కట్ చేస్తే శైలజను కొందరు తరుముతుంటే ఒక ఇంటికి వెళ్తుంది శైలజ అక్కడ వాసు, రాజేశ్వరీ ఇద్దరు ఎఫైర్ పెట్టుకుంటారు. శైలజ చూసిన విషయం వీళ్లకు తెలుస్తుంది. దాంతో ఎలాగైనా తను బతికుండా కూడదు అని జమీందారి భార్య తన మనుషులతో అంటుంది. అలాగే అమ్మా అని తన దగ్గర పనిచేవారు అంటారు. తరువాత శైలు గురించి అన్ని తప్పుడు విషయాలను చేస్తారు. గ్రామస్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటారు. తనను ఊరి నుంచి తరిమేస్తాడు. తరువాత ఎవరికి చెప్పును అని బతిలాడిన వినకుండా తనను వాసు చంపేస్తాడు. నీలాంటి వాల్లు బతకూడదు అని బిల్డింగ్ నుంచి కింద పడేస్తాడు.కిరోసిన్ పోసి తగలబెట్టెస్తాడు. అది డాక్టర్ చూస్తాడు.
తరువాత సీన్లో రవి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. జమిందారు ఇంటి ముందు తన భార్య శవం ఉంటుంది. ఎలా జరిగింది అంటే ఊర్లో జరిగే ఘోరాలు చూడలేక ఇలా మాలక్ష్మి అమ్మవారికి బలి ఇచ్చుకుంది అని మాయతో చెప్తాడు. అందరూ తనను దేవుతలా కొలుస్తారు. దైవం చేసే న్యాయాన్ని సాటి మనుషుల రూపంలోనే తీరుస్తుందని ఎస్ఐ భావిస్తుంది. తరువాత సీన్లో గాయపడ్డ జమీందారుకు కట్టుకట్టి.. చేసిన తప్పుకు మీ భార్యను చంపేశారు. తరువాత ఊరిందరిలో దేవతను చేశారు అని అడుగుతాడు. ఊరందరిలో తానంటే మంచి నమ్మకం ఉంది. ఇలాంటిది అని తెలిస్తే వాళ్ల నమ్మకం పోతుంది అని చెప్తాడు. అయినా శైలజను చంపింది వీళ్లేనని నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాడు. కట్ చేస్తే పులి మందుతాగుతూ.. గుడ్డివాడిగా నటిస్తున్నాను కాబట్టే తినడానికి, తాగడానికి డోకా లేదని అనుకుంటూ మందు తాగుతాడు. ఆరోజు రాత్రి తోట బావి దగ్గర మందు తాగుతుంటే శైలజను బావి దగ్గరకు తీసుకొస్తారు. వాసు మెడకు తాడు కట్టి చంపేస్తాడు. తరువాత బావిలో తోసేస్తారు. తరువాత రవి ఏడుస్తుంటే పులి నిజం చెప్తాడు. ఇదే విషయం చెప్పి పులి మళ్లీ గుడ్డివాడిగా నటిస్తాడు. తరువాత ఇలాంటి అక్రమ్ సంబంధాల గురించి ప్రతీ గ్రామంలో గోడలపై చూపిస్తారు. కట్ చేస్తే రవి, శైలజ ఇద్దరు తోటలో కనిపిస్తారు. త్వరలో పార్ట్ 2 వస్తుంది అని పడుతుంది. ఇది మంగళవారం మూవీ ఎక్స్ ప్లనేషన్..