Payal : ఆట్.. అది.. పబ్‌లో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్!
Payal Rajput : 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి.. హీరోగా కార్తికేయ ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నారే.. అదే రేంజ్లో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా స్టార్ డమ్ అందుకుంది. చివరగా మంగళ వారంతో మంచి హిట్ కొట్టిన పాయల్.. పబ్‌లో ప్రియుడి తల పగలగొట్టి షాక్ ఇచ్చింది.
ఆర్ ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్ కలిసి చేసిన మంగళ వారం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ ఇచ్చిన బీజిఎం వేరే లెవల్ అనే చెప్పాలి. ఇక ఆర్ ఎక్స్ 100 నుంచి పాయల్ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో దడపుడుతుంది.. ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి.. ఆమె ఫిగర్‌కు దాసోహం కానీ వారు ఉండరేమో. ఫస్ట్ సినిమాతోనే అలా కట్టిపడేసింది అమ్మడు. అయితే ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకున్నప్పటికీ.. క్లిక్ కాలేకపోయింది. కానీ రీసెంట్గా వచ్చిన మంగళ వారంతో సినిమాతో అదరగొట్టింది పాయల్. ఇదే జోష్‌లో ప్రస్తుతం సినిమాలు చేస్తోంది అమ్మడు.
కొన్ని లేడీ ఓరియేంటెడ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తోంది. అయితే.. వాలెంటైన్స్ డే సందర్భంగా పబ్‌లో బీర్ బాటిల్‌తో తన ప్రియుడి తల పగొలగొట్టి షాక్ ఇచ్చింది పాయల్. అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. పాయల్ రాజ్ పుత్ కొంత కాలంగా సౌరబ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది.
కానీ ప్రేమికుల రోజున తల పై బాదడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే పాయల్ నిజంగా అలా చేసిందంటే పొరబడ్డట్టే. సినిమాల వాళ్ల పబ్లిసిటీ స్టంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ షూట్లో భాగంగా ప్రియుడి తలపై బీర్ బాటిల్‌తో కొట్టింది పాయల్. అందుకే.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా వాలంటైన్స్ డేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను.. మీరేలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెప్పండి.. అంటూ క్యాప్షన్ రాసి పోస్ట్ చేసింది. దీంతో మంచి పని చేశావ్.. బాబోయ్ ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ వద్దని కామెంట్స్ చేస్తున్నరు కుర్రాళ్లు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.