»Break For Pushpa2 Allu Arjun For The Prestigious Film Festival
Allu Arjun : పుష్ప2కి బ్రేక్.. ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్‌కి అల్లు అర్జున్!
Pushpa 2 : ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఎలాగైనా సరే పుష్ప సెకండ్ పార్ట్‌తో వెయ్యి కోట్లు రాబట్టాలని ఫిక్స్ అయి ఈ సినిమా చేస్తున్నాడు. అయితే.. ఇప్పుడు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్‌కి వెళ్లాడు బన్నీ.
ఉన్నట్టుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎయిర్ పోర్ట్‌లో కనిపిచండంతో.. అల్లు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అందులోను పుష్పరాజ్ గెటప్‌లో రఫ్‌గా కనిపించడంతో.. బన్నీ మస్త్ ఉన్నాడు అంటు ట్రెండ్ చేస్తున్నారు. కానీ పుష్ప2 షూటింగ్‌తో బిజీగా ఉన్న బన్నీ.. సడెన్‌గా ఈ జర్నీ ఎందుకు? ఎక్కడికెళ్తున్నాడు? ఎందుకెళ్తున్నాడు? పుష్ప2 షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తున్నాడా? అనే సందేహాలు వచ్చాయి. అయితే.. పుష్ప షూటింగ్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చి బెర్లిన్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం జర్మనీకి వెళ్లాడు బన్నీ.
పుష్ప పార్ట్ 1 సినిమాతో బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్న బన్నీకి.. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్లో ఇండియా సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పే మరో అవకాశం దక్కింది. ఫిబ్రవరి 15 నుంచి జరగనున్న 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి అల్లు అర్జున్ బెర్లిన్‌కు బయలుదేరారు. అందుకు సంబంధించిన ఎయిర్ పోర్ట్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్‌కి టాలీవుడ్ నుంచి వెళుతున్న ఏకైక హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పుష్ప.. ది రైజ్ సినిమాను ప్రదర్శించనున్నారు. అక్కడ స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత అంతర్జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ కానున్నాడు బన్నీ. దీంతో పుష్ప2 సినిమాకు ఇక్కడి నుంచే ఇంటర్నేషనల్ లెవల్లో ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నాయి. ఆగష్టు 15న పుష్ప.. ది రూల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మరి వెయ్యి కోట్లు టార్గెట్‌గా వస్తున్న పుష్ప2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.