లిప్ లాక్ ఎఫెక్ట్.. యంగ్ హీరోని రిజెక్ట్ చేసిన శ్రీలీల?
Sree Leela : యంగ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం ఖాళీగానే ఉంది. కానీ నిన్న మొన్నటి వరకు శ్రీలీల అంటే.. ఉరుకులు పరుగులు ఉండేవి. ప్రతి ఆఫర్‌ను ఓకె చేసిన ఈ ముద్దుగుమ్మ ఓ హిట్ సీక్వెల్‌ను మాత్రం రిజెక్ట్ చేసింది. అందుకు అసలు కారణం ఇదే అంటున్నారు.
యంగ్ బ్యూటీ శ్రీలీలకు ఎలాంటి ఆఫర్లు వచ్చాయే అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక సమతమమైంది శ్రీలీల. అయినా కూడా వచ్చిన ఆఫర్‌ను వచ్చినట్టే తన ఖాతాలో వేసుకుంది. యంగ్ హీరోలే కాదు.. ఏకంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌తో కూడా ఛాన్స్ అందుకుంది అమ్మడు. కానీ ఒక్క సినిమాను మాత్రం రిజెక్ట్ చేసింది శ్రీలీల. ఎడాపెడా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. ఆ హిట్ సీక్వెల్‌ను ఎందుకు రిజెక్ట్ చేసిందో? ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అసలు రీజన్ అదే అంటున్నారు.
డీజె టిల్లు సీక్వెల్‌గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధు జొన్నగడ్డ సరసన ముందుగా శ్రీలీలను హీరోయిన్గా అనుకున్నారు. ఆమె పై కొంత షూటింగ్ కూడా చేసినట్టుగా వార్తలొచ్చాయి. కానీ మధ్యలోనే ఈ సినిమా నుంచి తప్పుకుంది శ్రీలీల. ఆ తర్వాత టిల్లు కోసం జోడీని సెట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నారు మేకర్స్. ఫైనల్‌గా అనుపమ పరమేశ్వరన్ ఓకె అయింది. అయితే.. ఈ క్యూట్ బ్యూటీ కూడా వెంటనే ఎస్ చెప్పలేదు. కానీ చివరికి టిల్లుతో రొమాన్స్ చేయడానికి సై అనేసింది.
ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ ట్రైలర్లో అనుపమను చూస్తే.. కుర్రాళ్ల హార్ట్ బీట్ పెరిగిపోతోంది. లిప్ లాక్‌తో రెచ్చిపోయింది అనుపమా. అందుకే.. శ్రీలీల టిల్లుగాడికి నో చెప్పి ఉండొచ్చనే టాక్ నడుస్తోంది. లిప్ లాక్‌లు, గ్లామర్ డోస్ చేయడం ఇష్టం లేకనే.. టిల్లు స్క్వేర్ నుంచి శ్రీలీల తప్పుకుందని అంటున్నారు. మరి మార్చి 29న రానున్న టిల్లు స్క్వేర్‌లో అనుపమా ఎలా రచ్చ చేస్తుందో చూడాలి.