Sreeleela: ఆల్రెడీ రెండు ఔట్.. ఇలా అయితే కష్టమే శ్రీలీల!
ప్రస్తుతం టాలీవుడ్లో వినిపిస్తున్న ఏకైక పేరు శ్రీలీల. అమ్మడు నటించిన సినిమాలు నెలకొకటి రిలీజ్ అవుతున్నాయి. కానీ రిజల్ట్స్ మాత్రం తేడా కొట్టేస్తున్నాయి. ఇలాగే ఉంటే రాను రాను శ్రీలీల కెరీర్ డేంజర్ జోన్లో పడే ఛాన్స్ ఉందంటున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ హాట్ కేక్‌గా ఉన్న హీరోయిన్ శ్రీలీల. అమ్మడి చేతిలో ఏకంగా పది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వచ్చిన ప్రతి ఆఫర్‌ను ఓకే చేసేసింది అమ్మడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు యంగ్ హీరోల సరసన కూడా రొమాన్స్ చేస్తోంది. అసలు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరి హీరోలతో రొమాన్స్ చేస్తోంది. మొత్తంగా కెరీర్ స్టార్ట్ అయిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ పక్కన హీరోయిన్గా నటించే ఛాన్స్ అందుకుంది శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో సో.. సో.. అనిపించుకున్న ఈ యంగ్ బ్యూటీ.. ధమాకా సినిమాలో తన గ్లామర్ అండ్ డాన్స్‌తో యూత్‌ని ఫిదా చేసింది.
అయితే ఈ సినిమా తర్వాత శ్రీలీల ఒక్కటే హిట్ అందుకుంది. శ్రీలీల చేస్తున్న సినిమాలు నెలకొకటి రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్గా బాలయ్య ‘భగతవంత్ కేసరి’తో హిట్ కొట్టింది అమ్మడు. కానీ రామ్‌తో చేసిన స్కంద సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా శ్రీలీల కెరీర్‌కు ఏ విధంగాను కలిసి రాలేదు. ఇక ఈ వారం రిలీజ్ అయిన వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ యావరేజ్ టాక్‌తో మొదలై.. నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో స్కంద, ఆదికేశవ వల్ల శ్రీలీల ఖాతాలో రెండు నెలల్లో రెండు ఫ్లాప్స్ పడ్డాయి.
ఇక నెక్స్ట్ మంత్ అంటే, డిసెంబర్లో నితిన్ ‘ఎక్స్ట్రార్డినరీ మేన్’తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఆ తర్వాత జనవరిలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి శ్రీలీల ఆశలన్నీ ఈ రెండు సినిమాల పైనే ఉన్నాయి. లేదంటే శ్రీలీల కెరీర్ కష్టమనే అంటున్నారు. ముఖ్యంగా శ్రీలీల కథల విషయంలో ఆచితూచి అడుగేయాలని అంటున్నారు. లేదంటే త్వరలోనే అమ్మడు సర్దుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు.