న్యాచురల్ స్టార్ నానికి యాక్సిడెంట్ అయిందా? అంటే, ఔనన్ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కానీ నాని మాత్రం ఈ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరి నానికి ఏ సినిమా షూటింగ్లో యాక్సిడెంట్ అయింది?
కొత్త డైరెక్టర్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ముందు వరుసలో ఉంటాడు న్యాచురల్ స్టార్ నాని. చివరగా ‘దసరా’ సినిమాతో శ్రీకాంత్ ఓదెలను టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ చేసిన నాని.. నెక్స్ట్ సినిమా ‘హాయ్ నాన్న’తో శౌర్యువ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు. డిసెంబర్ 7న హాయ్ నాన్న సినిమా రిలీజ్ కాబోతోంది. రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్.. థియేటర్లో ఎమోషనల్ ట్రీట్ ఇవ్వడం పక్కా అనేలా ఉంది. ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. నాని కుమార్తెగా బేబీ కియారా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు నాని.
కానీ ప్రతి ప్రమోషనల్ ఈవెంట్లోను కళ్ళజోడుతోనే కనిపిస్తున్నాడు నాని. మామూలుగా అయితే సెలబ్రిటీలు స్టైల్ కోసమే ఇలాంటి కూలింగ్ గ్లాస్లు పెట్టుకుంటారు. కానీ నాని స్టైల్ వెనక యాక్సిడెంట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. హాయ్ నాన్న తర్వాత మరోసారి వివేక్ ఆత్రేయతో కలిసి మాస్ సినిమా చేస్తున్నాడు నాని. ‘సరిపోదా శనివారం’ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి.. ప్రస్తుతం కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోనే నానికి యాక్సిడెంట్ అయిందని సమాచారం.
ఆయన కంటికి చిన్న గాయమైందని అంటున్నారు. దీంతో డాక్టర్లు ఒక నెల రోజుల పాటు కూలింగ్ గ్లాస్ ధరించమని నానికి సూచించినట్లు తెలిసింది. అందుకే నాని ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్‌లో కళ్లజోడుతో కనిపిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల ఇన్సైడ్ టాక్. అయితే నాని ప్రమోషన్స్ జోరు చూస్తుంటే అది చిన్న యాక్సిడెంట్ అనే చెప్పొచ్చు. కాబట్టి నాని ఫ్యాన్స్‌కు ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు.