Tillu square: రాధికను వదలని టిల్లుగాడు.. సీక్వెల్ నుంచి కొత్త సాంగ్!
ఈసారి మన టిల్లుగాడు చేయబోయే రచ్చ మామూలుగా ఉండదని చెబుతూనే ఉన్నారు మేకర్స్. తాజాగా టిల్లు స్క్వేర్ నుంచి కొత్త సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ పాటతో మరోసారి రాధిక జపం చేస్తున్నాడు టిల్లుగాడు.
డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ హీరోయిన్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ చేశారు మేకర్స్. ఫైనల్‌గా క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ను లాక్ చేసి జెట్ స్పీడ్‌లో షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే అనుపమకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ లుక్‌లో అనుపమని చూసి అచ్చు ‘రాధిక’ గుర్తొచ్చేలానే ఉందని అన్నారు. కర్లీ హెయిర్‌తో క్యూట్‌గా కట్టిపడేసింది అమ్మడు. ఇక ఇప్పుడు అనుపమా క్యారెక్టర్ పేరు రాధికా అని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే టిక్కెటే కొనకుండా.. అనే సాంగ్‌ను రిలీజ్ చేయగా.. తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు చేశారు.
ఈ సందర్భంగా.. రాధిక.. రాధిక అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. రామ్ మిరియాల సంగీతం వహించిన ఈ సాంగ్ అదిరిపోతుందని చెబుతున్నారు. ఫుల్ లిరికల్ సాంగ్‌ను 27వ తేది సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సాంగ్‌తో టిల్లు స్క్వేర్‌లో అనుపమ పేరు కూడా రాధికనే అనే హింట్ ఇచ్చారు మేకర్స్. కానీ సీక్వెల్లో రాధికను తలుచుకుంటు టిల్లు గాడు ఈ సాంగ్ పడినట్టుగా ఉంది.
అనుపమలో రాధికను చూస్తున్నాడనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. ఇకపోతే.. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న టిట్లు స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా సిద్ధుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.