సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష్లో ముచ్చటగా మూడోసారి వస్తున్న సినిమా గుంటూరు కారం. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఇప్పుడు మహేష్ బాబు రుబాబు షురు అయిందంటున్నారు.
Guntur Kaaram: చివరగా సర్కారు వారి పాటతో కమర్షియల్‌గా ఓకె అనిపించిన మహేష్ బాబు.. ఇప్పుడు త్రివిక్రమ్‌తో కలిసి అసలైన మాస్ జాతర చూపించడానికి వస్తున్నాడు. గుంటూరు కారం రిలీజ్‌కు మరో రెండు వారాలు మాత్రమే ఉంది. జనవరి 12న సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటివరకు గుంటూరు కారం నుంచి మాస్ స్ట్రైక్ అంటూ ఒక ఒక్క గ్లింప్స్‌తో పాటు.. రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు. మాస్ స్ట్రైక్‌తో బీడిని త్రీడిలో చూపించిన మహేష్.. దమ్ మసాలా సాంగ్‌తో మాస్ బిర్యానీ టేస్ట్ చూపించాడు. కానీ ఓ బేబీ సాంగ్‌తో కాస్త నెగెటివ్ వైబ్‌ను చూడాల్సి వచ్చింది.
దీంతో గుంటూరు కారం నుంచి మరో సాలిడ్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఈ క్రమంలో మాస్ సాంగ్ వస్తుందంటూ.. సోషల్ మీడియాలో టాక్ నడిచింది. అయినా ఇప్పటి వరకు మేకర్స్ నుంచి సాంగ్ అప్టేట్ ఇవ్వలేదు. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుండి రోజుకో పోస్టర్ మాత్రం రిలీజ్ చేస్తున్నారు. క్రిస్మస్ మొదలుకొని ఇప్పటివరకు నాలుగైదు న్యూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. మాస్, క్లాస్, లుంగీ లుక్‌తో అదిరిపోయే లుక్‌లో కనిపిస్తున్నాడు మహేష్. లేటెస్ట్గా ఇది రమణగాడి రుబాబు అంటూ ఓ లుక్ రిలీజ్ చేశారు.
#RamanaGadiRuBABU Trending with #GunturKaaram, #MaheshBabu.. ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇదే జోష్ని కంటిన్యూ చేస్తూ.. థర్డ్ సాంగ్‌ని డిసెంబర్ 30న లేదా న్యూ ఇయర్ గిఫ్ట్‌గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి గుంటూరు కారం ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి. జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే వేదిక పై థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. మరి గుంటూరు కారం ఎలా ఉంటుందో చూడాలి.