»Vijay Devarakonda And Rashmika Will Get Married But Venu Swamys Shocking Comments
Vijay Devarakonda-Rashmika పెళ్లి చేసుకుంటారు.. కానీ? వేణు స్వామి షాకింగ్ కామెంట్స్
సోషల్ మీడియా పుణ్యమా అని వేణు స్వామి చాలా ఫేమస్ అయిపోయాడు. స్టార్ సెలబ్రిటీస్ పై ఈయన చేసే కామెంట్స్ ఎప్పుడూ వైరల్ అవుతునే ఉంటాయి. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయింది.
Vijay Devarakonda-Rashmika: మామూలుగా అయితే వేణు స్వామి చెప్పేది ఎవ్వరు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఆయన చెప్పేది అప్పుడప్పుడు నిజం అవుతుండడంతో.. సెలబ్రిటీస్ అంతా ఆయన వెనకలా పడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు వేణు స్వామితో పూజలు చేయించుకుంటున్నారు. రష్మిక, డింపుల్ హయాతి, నిధి అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా అతనితో పరిహార పూజలు చేయించుకున్నారు. అందుకు సంబంధించిన ఎన్నో వీడియో సోషల్ మీడియాలో ఉన్నాయి. దీంతో ఈ జ్యోతిష్యుడు చెప్పే హీరో, హీరోయిన్ల జాతకాలు ఎప్పటికప్పుడు హాట్ టాపికేనని చెప్పాలి.
ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ కొందరు వేణు స్వామిని వెతుకుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు కెరీర్ ఉండదని గతంలో చెప్పుకొచ్చాడు ఈయన. ఇప్పుడు సలార్ హిట్ అవడంతో.. వేణు స్వామి ఎక్కడ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగానే.. తాజాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో విజయ్, రష్మిక రిలేషన్ షిప్ గురించి ప్రశ్నించగా.. వేణు స్వామి అది అందరికి తెలిసిందే కదా అని అన్నారు. అంతేకాదు.. రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటారు అని కూడా చెప్పుకొచ్చాడు. కానీ అలా చేస్తే.. విడిపోతారు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.
ఈ విషయాన్ని తనే రష్మికకే స్వయంగా చెప్పానని కూడా అన్నాడు. డైరెక్ట్‌గా విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోకు అని చెప్పడంతో.. రష్మికకి తనకి గొడవలు కూడా జరిగాయి.. అప్పటి నుంచే మా మధ్య విభేదాలు వచ్చాయి. అయినా కూడా తనకేం ఇబ్బంది లేదు.. అని వేణు స్వామి తెలిపారు. ఏదేమైనా.. పెళ్లి గురించి రష్మికకు వేణు స్వామి చెప్పింది నిజమేనా? అనేదే ఇక్కడ డౌట్.