»Salaar Salaar In The 500 Crore Club Runs Towards 600 Crore
Salaar: 500 కోట్ల క్లబ్లో సలార్.. 600 కోట్ల వైపు పరుగులు!
ఎట్టకేలకు బాహుబలి 2 తర్వాత మంచి హిట్ కొట్టాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రశాంత్ నీల్‌తో కలిసి డైనోసర్గా బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్న సలార్.. తాజాగా 500 కోట్ల క్లబ్లో ఎంటర్ అయింది.
Salaar: ప్రభాస్, ప్రశాంత్ నీల్ లాంటి పవర్ హౌజ్ కాంబినేషన్ కలిస్తే ఎలా ఉంటుందో.. ప్రస్తుతం థియేటర్లో చూస్తున్నారు ఆడియెన్స్. కేజీయఫ్ చూసిన తర్వాత.. హీరోకి ఇలా కూడా ఎలివేషన్ ఇస్తారా? అని ఫిదా అయ్యారు మూవీ లవర్స్. దీంతో ప్రభాస్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్ ఇంకెలా ఉంటుందోనని ఊహించుకున్నారు. అందుకు తగ్గట్టే.. సలార్‌లో సీన్ టు సీన్ ప్రభాస్‌ను నెక్స్ట్ లెవల్ అనేలా ఎలివేషన్ ఇచ్చి.. గూస్ బంప్స్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. దీంతో మొదటి మూడు రోజుల్లో రోజుకి వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది సలార్.
డే వన్ 178 కోట్లు, డే 2-117 కోట్లు, డే-107 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా మూడు రోజుల్లోనే 402 కోట్లు రాబట్టిన సలార్.. నాలుగో రోజు 450 కోట్ల మార్క్ దాటి.. 200 కోట్లకు పైగా షేర్ రాబట్టి సెన్సేషన్ అయింది. అయితే ఐదు రోజుల్లో సలార్ 500 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవుతుందని భావించారు. కానీ ఫైనల్‌గా ఆరు రోజుల్లో 500 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయింది సలార్. మిడ్ వీక్‌లో సలార్ కలెక్షన్స్ కాస్త స్లో అయినా.. మళ్లీ వీకెండ్ వస్తుంది కాబట్టి.. పుంజుకునే అవకాశం ఉంది. మొత్తంగా సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యే వరకు.. సలార్ 600 కోట్ల మార్క్ క్రాస్ చేయనుందని అంటున్నారు.
సంక్రాంతి వరకూ సలార్‌దే హవా ఉంటుంది కాబట్టి.. సలార్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ రేంజ్ వసూళ్లను నమోదు చేయడం గ్యారెంటీ అంటున్నారు. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ రీచ్ అయిన సలార్.. నైజాం ఏరియాలో లాభాల బాట పట్టింది. ఇక ‘సలార్: సీజ్ఫైర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ వీకెండ్ వరకు చోట్ల సలార్ బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది.