»Stock Markets Ended The Week With Losses Of Sensex 188 Points November 17th 2023
Stock markets: వారంతంలో 188 పాయింట్ల నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు(indian stock markets) శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అయితే నిన్న ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కారణంగా బ్యాంకింగ్ స్టాక్స్ మందగించాయి. కానీ నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు మాత్రం గ్రీన్‌లో కొనసాగాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
indian stock market losses december 21st 2023 sensex loss 440 points
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వారంతంలో స్పల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 187.75 పాయింట్లు లేదా 0.28 శాతం క్షీణించి 65,794.73 వద్ద, నిఫ్టీ 33.40 పాయింట్లు లేదా 0.17 శాతం క్షీణించి 19,731.80 వద్ద ఉన్నాయి. ఈ క్రమంలో దాదాపు 1926 షేర్లు పురోగమించాయి, 1654 షేర్లు క్షీణించాయి. కానీ 138 షేర్లలో మార్పులేకుండా ఉన్నాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 577 పాయింట్లు నష్టపోగా..నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు గ్రీన్ లో ముగిశాయి.
ఇక నిఫ్టీలో ఎస్బిఐ, యాక్సిస్ బ్యాంక్, ఒఎన్‌జిసి(ONGC), బిపిసిఎల్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్‌గా ఉండగా, లాభపడిన వాటిలో ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, అపోలో హాస్పిటల్స్, లార్సెన్ అండ్ టూబ్రో, హీరో మోటోకార్ప్ ఉన్నాయి. సెక్టార్లలో ఆటో క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, రియల్టీ 0.5 శాతం చొప్పున పుంజుకోగా, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.5 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.3 శాతం క్షీణించాయి.
అసురక్షిత రుణాల కోసం రిస్క్ వెయిట్లను ఆర్బిఐ(RBI) పెంచిన నేపథ్యంలో బ్యాంకింగ్ రంగం నష్టాలను చవిచూసింది. పెట్టుబడిదారులు ఈరోజు తర్వాత యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు చమురు ధరలలో పదునైన తగ్గుదల, US దిగుబడి నియంత్రణ వంటి అంశాలు స్వల్పకాలంలో మార్కెట్‌ను నిలబెట్టడానికి సహాయపడ్డాయి. ఈ క్రమంలో గత ముగింపు 83.23తో పోలిస్తే డాలర్‌తో భారత రూపాయి స్వల్పంగా తగ్గి 83.27 వద్ద ముగిసింది.