SKLM: పొందూరు మండలం మొదలవలస పరిసర ప్రాంతాలు సింగూరు కింతలి కనిమెట్ట, బొడ్డేపల్లిలో బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం వేళల్లో పొగమంచు కారణంగా రహదారులపై ముందు వెళ్తున్న వాహనాలు కనపడక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి, ప్రధాన రహదారులపై ప్రయాణించే వాహనదారులు నెమ్మదిగా ప్రయాణం చేయాలని పలువురు అధికారులు సూచించారు.