ADB: సొనాల మండలంలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతోంది. మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. చలి తీవ్రత కారణంగా ఓటర్లు ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికలు సజావుగా జరగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.