NLR: భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లిన ఎంపీ వేమిరెడ్డి ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు.