VZM: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని డీఎస్పీ గోవిందరావు సూచించారు. డెంకాడలో మంగళవారం పర్యటించిన ఆయన ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను స్వయంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు అందించారు. ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు పెంచాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు.