»Stock Markets Create Another Record Nifty To All Time High With 19700 Points
StockMarket: మరోరికార్డ్ క్రియేట్ చేసిన స్టాక్ మార్కెట్స్..19700 పాయింట్లతో ఆల్టైమ్ గరిష్ఠానికి నిఫ్టీ
ఈ మధ్యకాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు జోరుమీదున్నాయి. తాజాగా అవి ఆల్టైమ్ గరిష్ఠాన్ని చేరుకున్నాయి. వరుస లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నేడు జీవితకాల గరిష్ఠానికి స్టాక్ మార్కెట్లు చేరాయి.
BJP win in three states sensex increased thousand points on december 4th 2023
స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఆల్ టైమ్ గరిష్ఠానికి(All time Record) చేరుకున్నాయి. వరుసగా లాభాలను నమోదు చేస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. తాజాగా సోమవారం స్టాక్ మార్కెట్లు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. నేటి ఉదయం 66,148 పాయింట్ల వద్ద సెన్సెక్స్(sensex) మొదలైంది. ఆ తర్వాత ఈ రోజంతా లాభాల్లోనే సెన్సెక్స్ కొనసాగింది.
ఇంట్రాడేలో 66,656 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆఖరికి 529.03 పాయింట్ల లాభంతో 66,589.93 వద్ద సెన్సెక్స్(sensex) స్థిరపడింది. మరో వైపు నిఫ్టీ(Nifty)లో మొట్టమొదటి సారిగా 19,700 పాయింట్లు దాటింది. ఆఖరికి 146.95 పాయింట్ల లాభంతో 19,711.45 వద్ద నిఫ్టీ ముగిసింది. ట్రేడింగ్లో నేడు దాదాపు 2013 షేర్లు పురోగమించగా 1,559 షేర్లు క్షీణించాయి. 174 షేర్లలో మాత్రం మార్పు రాలేదు.
నిఫ్టీ(Nifty)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, విప్రో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటివి భారీగా లాభాలను పొందాయి. హీరో మోటోకార్ప్, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, జెఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.