KKD: కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో లక్షల్లో పేరుకుపోయిన నీటి పన్ను వసూళ్లపై కమిషనర్ సత్యనారాయణ దృష్టి సారించారు. కొన్నేళ్లుగా పన్ను కట్టని వారికి నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో, మంగళవారం పలు కనెక్షన్లు తొలగించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 25వ తేదీలోగా బకాయిలు చెల్లించని వారి కనెక్షన్లు పూర్తిగా తొలగిస్తామని కమిషనర్ హెచ్చరించారు