ATP: గుత్తి ఫుట్బాల్ క్రీడా మైదానం సమీపంలో బుధవారం తెల్లవారుజామున బేబీ ప్రసన్న అనే మహిళకు చెందిన దోసల టిఫిన్ సెంటర్ గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆమె మాట్లాడుతూ.. దోసలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నానని, గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో టిఫిన్ సెంటర్ మొత్తం మంటల్లో ఖాళీ బూడిదైందన్నారు. సుమారు రూ.50 వేల ఆస్తి నష్టం వాటిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.