»Mangalavaram Box Office Suffered A Major Blow Due To The World Cup Final
Mangalavaram: కలెక్షన్లకు వరల్డ్ కప్ దెబ్బ!
మంగళవారం చిత్రం కలెక్షన్లపై భారీ దెబ్బ పడింది. ఆదివారం రోజున వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన పథ్యంలో ఈ సినిమాకు ప్రేక్షకులు పెద్దగా రాలేదు. అంతేకాదు మేకర్స్ అనుకున్నదాని కంటే తక్కువ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
Mangalavaram box office suffered a major blow due to the World Cup final
ప్రేక్షకులు చాలా కాలం నుంచి ఎదురుచూసిన సినిమాల్లో మంగళవారం(Mangalavaram) కూడా ఒకటి. మూవీ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ బాగా వచ్చింది. మొదటి మూడు రోజులు కలెక్షన్లు బాగానే రాబట్టింది. ఆదివారం కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తుందని మేకర్స్ భావించారు. కానీ ఆదివారం ఈ మూవీ కలెక్షన్లకు వరల్డ్ కప్ దెబ్బ తగిలింది. ఫలితంగా మూవీ కలెక్షన్లు బాగా పడిపోయినట్లు తెలుస్తోంది.
ఏ చిన్న లేదా మధ్యస్థ బడ్జెట్ సినిమాకైనా 1వ ఆదివారం ఉత్తమమైన రోజుగా ఉండాలి. కానీ ఈసారి ప్రపంచ కప్ ఫైనల్ నేపథ్యంలో మంగళవారం చిత్రం చాలా దెబ్బతింది. మంగళవారం ఓపెనింగ్ రోజున రూ.2.2Cr షేర్ వసూలు చేసింది. మొదటి కలెక్షన్స్ లో 80% రాబట్టింది. కానీ 3వ రోజు 2వ రోజు నుంచి 50% కంటే తక్కువ కలెక్షన్స్ రావడంతో సినిమా గణనీయమైన డ్రాప్ చూసింది. ఇది మేకర్స్ కి గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో(telugu states) ఈ సినిమా 1కోటి కంటే తక్కువ షేర్ వసూలు చేసింది.
మొత్తం మొదటి వారాంతం ప్రపంచవ్యాప్తంగా షేర్ 5Cr రూపాయల పరిధిలో ఉంది. థియేట్రికల్ విలువ రూ.13 Cr. అయితే వరల్డ్ కప్ ఫైనల్ లేకుంటే ఈ సినిమా దాదాపు 3కోట్ల షేర్ వసూలు చేసి ఉండేది. కానీ ఇప్పుడు 1కోటి కంటే తక్కువ షేర్ వసూలు(collections) చేసి బయ్యర్లను చాలా రిస్క్‌లో పడేసింది. మరి ఈరోజు సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో తెలియాల్సి ఉంది. ఈరోజు మంగళవరం బాగా ఆడకపోతే బయ్యర్లు భారీగా నష్టపోవాల్సి వస్తుంది.