బాహుబలి రాకముందు ఖాన్ త్రయం బాలీవుడ్‌ని ఏలుతోంది. ఒక్క బాలీవుడ్‌నే కాదు.. యావత్ ఇండియన్ సినిమాను సైతం అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఏలారు. కానీ ప్రభాస్ ఒకే ఒక్క సినిమాతో ఖాన్ త్రయాన్ని సైతం భయపడేలా చేశాడు. పాన్ ఇండియా సినిమాలకు పునాది వేశాడు.
Kalki: ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా.. ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోతాడు ప్రభాస్. ఇక.. ప్రభాస్ ఒక్కో సినిమాకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు మూవీ మేకర్స్. తెలుగు నుంచి వచ్చిన ఫస్ట్ భారీ బడ్జెట్ సినిమా బాహుబలి. ఇక్కడి నుంచి ప్రభాస్ సినిమా అంటే.. మినిమం 300 కోట్లు ఉండాల్సిందే. అలాగే.. బాహుబలి 2 సినిమాతో హిందీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్. నార్త్ ఆడియెన్స్ ప్రభాస్ ప్రతీ సినిమాకు బ్రహ్మరథం పడుతునే ఉన్నారు. ఇప్పుడు కల్కికి ఫిదా అవుతున్నారు బాలీవుడ్ వాసులు. ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లో.. డే బై డే కలెక్షన్స్ పెరుగుతునే ఉన్నాయి.
ఒక రోజుకి మించి మరో రోజు అన్నట్టుగా.. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి.. బాలీవుడ్లో మొత్తం నాలుగు రోజుల్లో 115 కోట్లు కొల్లగొట్టింది కల్కి. ఫస్ట్ డే 22.50 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు 23.25 కోట్లు, మూడో రోజు 26.25 కోట్లు, నాలుగో రోజున 40.15 కోట్లతో వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యింది. దీంతో.. బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది కల్కి. అక్కడ థియేటర్ ఆక్యూపెన్సీ కూడా బాగుంది. ఇక రివ్యూలైతే మామూలుగా ఇవ్వడం లేదు హిందీ జనాలు. కల్కిని ఆకాశానికెత్తుస్తున్నారు. పైగా.. ఈ మధ్య కాలంలో అమితాబ్ బచ్చన్‌ను నాగ్ అశ్విన్ చూపించినట్టుగా బాలీవుడ్లో ఎవ్వరు చూపించలేకపోయారు. ఇక ప్రభాస్ స్టార్డమ్తో పాటు దీపిక పదుకొనే క్రేజ్, దిశా పటానీ గ్లామర్ ట్రీట్ కూడా సినిమాకు మరింత ప్లస్‌గా మారింది. దీంతో.. బాలీవుడ్లో దుమ్ముదులిపేస్తోంది కల్కి. ఖచ్చితంగా లాంగ్ రన్లో భారీ వసూళ్లను రాబట్టడం గ్యారెంటీ అంటున్నారు.