»Anushka Overwhelmed As Kohli Smashes 29th Test Century In 500th International Match
Anushka: విరాట్ కోహ్లీ సెంచరీ చూసి, అనుష్క రియాక్షన్ ఇదే..!
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ మార్కును అందుకున్నాడు. 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో 76వ అంతర్జాతీయ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. ఐదేళ్ల తర్వాత విదేశాల్లో టెస్టు సెంచరీ సాధించాడు.
500వ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన సందర్భంగా.. కోహ్లీ భార్య అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రత్యేక పోస్టు పెట్టింది. విరాట్ సెంచరీ చేసి అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఫోటో తీసి పోస్టు చేసింది. దీనికి లవ్ సింబల్‌ను జత చేసింది. మరోవైపు సచిన్ కూడా ఈ సెంచరీపై స్పందించాడు. ఇన్‌స్టాలో కోహ్లీ స్టోరీ షేర్ చేసిన సచిన్.. ‘మరో రోజు మరో సెంచరీ చేసిన కోహ్లీ. అద్భుతంగా ఆడావు’ అని స్టోరీస్‌లో రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు వైరల్‌గా మారాయి. ఇక వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది.