ఆస్ట్రేలియా-Aతో జరుగుతున్న తొలి అనధికారిక వన్డేలో భారత-A భారీ స్కోర్ సాధించింది. యువ ఆటగాడు ప్రియాంష్ ఆర్య(101), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(110) సెంచరీలతో చేలరేగారు. అలాగే, ఆయుష్ బదోని 27 బంతుల్లో 50, ప్రభ్సిమ్రాన్ సింగ్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో భారత-A నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది.