ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కు షాక్ తగిలింది. తనను మోసం చేశాడని అతని గర్ల్ ఫ్రెండ్ అందరి ముందు చెంప దెబ్బలు వాయించింది. జేడ్ యాబ్రో అనే మహిళ మైఖేల్ క్లార్క్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఈ సమయంలో మరో మహిళతో మైఖేల్ క్లార్క్ గడిపిన విషయం జేడ్ కు తెలిసింది.
దీంతో జేడ్ ఆగ్రహంతో ఊగిపోయింది. అందరి ముందే మైఖేల్ క్లార్క్ ను కొట్టింది. క్లార్క్ తన గర్ల్ ఫ్రెండ్ జేడ్ యాబ్రోకు సర్దిచెప్పాలని చూసినా వినిపించుకోలేదు. ఈ ఘటనపై క్లార్క్ స్పందించాడు. బహిరంగంగా ఇలా జరిగినందుకు అక్కడున్నవారికి క్షమాపణలు చెప్పాడు.