AUS-Aతో తొలి అనధికార వన్డేలో IND-A 171 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 413/6 స్కోర్ చేయగా.. ఆసీస్ 242 పరుగులకే పరిమితమైంది. భారత్ తరఫున ప్రియాంశ్ ఆర్య(101), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(110) సెంచరీలు చేయగా.. బౌటింగ్లో నిషాంత్ సింధు 4 వికెట్లతో రాణించాడు. ఆసీస్ తరఫున హార్వే(68), కెప్టెన్ విల్(50) అర్థ సెంచరీలు చేశారు.