సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో హెన్రిచ్ క్లాసెన్(36) చెలరేగి ఆడుతున్నాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 14 ఓవర్లో మొదటి మూడు బంతులను క్లాసెన్ సిక్సర్లుగా మలిచాడు. నాలుగో బంతికి అతడు ఇచ్చిన సులువైన క్యాచ్‌ను సూర్య కుమార్ జారవిడిచాడు. ఐదో బంతికి మరలా క్లాసెన్ ఫోర్ బాదాడు. ఆ తర్వాత రవి బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు స్కోరు 134/4. మిల్లర్(11), క్లాసెన్ (36) పరుగులతో ఉన్నారు.