VZM: అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో గోడ పత్రికలను ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఇందుకు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్య వివాహాలకు కారకులైన వారిపై చర్యలు తప్పవన్నారు.