పైనాపిల్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పండులో ఉండే తీపి, పులుపు రుచి కారణంగా చాలామంది తినేందుకు ఇష్టపడతుంటారు. ఇందులో సహజ చక్కెరలు, కేలరీలు అధికం. అలాగే, ఈ పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అందువల్ల వాళ్లు ఈ పండు తీసుకోకపోవడమే మంచిది.