ప్రకాశం: ఈనెల 24 నుంచి 26 వరకు జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి. జిల్లా మొత్తంగా 6481 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ప్యాడి566, బ్లాక్ గ్రామ్ 2206, బెంగాల్ గ్రామ్ 167, జోవర్ 2, కౌపీయ 2950, టొబాకో 590 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. వర్షాల కారణంగా పంటలు దెబ్బ తినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.