MHBD: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నేడు సీపీఐ పార్టీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పురవీధుల్లో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారధి ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు చేతపట్టి పురవీధుల్లో కదం తొక్కారు అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి 100 సంవత్సరాల్లో జరిగిన పోరాట స్ఫూర్తిని కార్యకర్తలకు ఆయన వివరించారు.