TG: చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీలో సభ్యలు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలన్నారు. చిల్డ్రన్ మాక్ అసెంబ్లీని స్పూర్తిదాయకంగా నిర్వహించిన విద్యార్థులను సీఎం అభినందించారు.18 ఏళ్లకు యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీదే అన్నారు. నెహ్రూ విద్యా, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు.