AP: సోషల్ మీడియాలో పోస్టుల కేసులో తనను వదిలేయాలంటూ మంత్రి లోకేష్‌కు సినీ నటి శ్రీరెడ్డి రాసిన లేఖపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ‘ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, సోషల్ ఇష్యూ. ఎన్నో బూతులు మాట్లాడారు. అసలు లిమిట్ లేకుండా పోయింది. అసభ్యకరంగా పోస్టులు పెట్టినా, కామెంట్స్ చేసినా కచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వదిలిపెట్టాలని ఎంత వేడుకున్నా, క్షమాపణలు కోరిన విడిచిపెట్టొద్దు’ అని షర్మిల వ్యాఖ్యానించారు.