జార్ఖండ్‌లోని జెర్మో నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ఇంఛార్జి గులాం అహ్మద్ మీర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తే పౌరులందరికీ.. వారిలో చొరబాటుదారులున్నా కూడా.. రూ.450కే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అన్నారు. ఇవి దేశ వ్యతిరేక వ్యాఖ్యలని, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలను ప్రతిబింబిస్తున్నాయని బీజేపీ నేతలు మండిపడ్డారు.