ఢిల్లీ సీఎం అతిశీ నేడు అతి పెద్ద ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు. సుందరి నగర్లో సరికొత్త హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్‌ను రూపొందించారు. మూడంతస్తుల్లో నిర్మించిన ఈ పాఠశాలలో 131 గదులు, 7 ల్యాబులు, లైబ్రరీ, యోగా రూం, కాన్ఫరెన్స్ హాల్, తదితర సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 7 వేల మంది చదువుకోవచ్చు. కాగా ఈ పాఠశాల ఇతర రాష్ట్రాలకు మోడల్‌గా నిలుస్తోంది.