AP: విద్యుత్ ఒప్పందాల్లో రూ.1750 కోట్ల అవినీతి జరిగిందని TDP నేత వర్ల రామయ్య అన్నారు. ఈ విషయం ప్రభుత్వం చెప్పలేదని.. అమెరికా కోర్టే చెప్పిందని గుర్తు చేశారు.YCP అవినీతి వల్ల డిస్కంలకు రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. జెన్కో ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించి.. అధిక ధరలకు కొనుగోలు చేశారని ఆరోపించారు. YCP హయాంలో ఒక్క విద్యుత్ ప్లాంట్ అయినా ఏర్పాటు చేశారా అని నిలదీశారు.