ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండియా కూటమిలో చిచ్చురాజుకుంది. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అలవికాని హామీలు ఇస్తున్నారని ఢిల్లీ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వ్యాఖ్యలపై ఆప్ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ను పంపించేలా ఆప్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇతర పార్టీలను ఒప్పించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.