SKLM: కోటబొమ్మాలి మండలం కురుడు గ్రామంలో పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో గురువారం 78 పశువులకు ఉచిత గొంతు వాపు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా కోటబొమ్మాళి సహాయ సంచాలకులు డా.M.లోకనాధము మాట్లాడుతూ.. కోటబొమ్మాళి మండలానికి 600 డోసులు ఇవ్వగా ఇప్పటి వరకు 267 టీకాలు వేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కురుడు పశువైద్యాధికారి డా.ఎల్.కిరణ్ కుమార్ పాల్గొన్నారు.