AP: ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్.. ఇదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని CM చంద్రబాబు అన్నారు. తమకు ప్రతిపక్షహోదా తీసేస్తామని మాట్లాడారని, ఇప్పుడు ప్రజలే వాళ్లను ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది నాయకులు కాదు.. ప్రజలు ఇవ్వాలన్నారు. హోదా ఇస్తేనే వస్తా అనే వాళ్లను చరిత్రలో చూడలేదన్నారు. రఘురామను అప్పుడు రాష్ట్రానికి రానివ్వని వాళ్లు ఇప్పుడు సభకు రాలేని పరిస్థితికి వచ్చారని పేర్కొన్నారు.