AP: సోషల్ మీడియాలో శాడిస్టుల్లా తయారై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘హోం మంత్రిని వదల్లేదు.. కుటుంబంలోని మహిళలను వదల్లేదు. రేపిస్టులు, నేరస్థులు రెచ్చిపోతున్నారంటే.. చట్ట సభ్యల్లో వాడే భాష కూడా కారణమే. గతంలో ఎంపీగా ఉన్న RRRను ఇబ్బంది పెట్టారు. ఓ ఎంపీకే ఇలాంటి పరిస్థితి ఉంటే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి..? సోషల్ మీడియా దుర్వినియోగ రక్షణ చట్టాన్ని తీసుకురావాలి’ అని పేర్కొన్నారు.