TG: కలెక్టర్‌పై దాడి ఘటనలో నిందితులను మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిశారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. దాడి కేసులో అరెస్ట్ అయిన వారికి BRS పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అరెస్ట్ అయిన వారిని పరిగి సబ్ జైలులో పరామర్శించానని అన్నారు. గతంలో దాడులు జరిగాయని తెలిసి కూడా కలెక్టర్ ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా గ్రామంలోకి వెళ్లారని ప్రశ్నించారు. పట్నం నరేందర్ రెడ్డిని రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.