TG: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎలాంటి అర్హత లేని సీఎం సోదరుడు లగచర్లకు వెళ్తే అధికారులు ఆహ్వానం పలికారని, కానీ ఎంపీ డీకే అరుణ వెళ్తే మాత్రం పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాను కేవలం దందాల కోసమే సృష్టించారని విమర్శించారు. ప్రజల భూములు, ఆస్తులు లాక్కునే ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు.