TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భుజంగరావుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ పొడిగించింది. నాలుగు రోజులపాటు బెయిల్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. బెయిల్ గడువు ముగియడంతో ఆయన నాంపల్లికోర్టుకు వెళ్లారు. హైకోర్టు నుంచి తమకు సమాచారం రాలేదని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు నుంచి మెమో తీసుకురావాలని సూచించింది.