TG: వికారాబాద్ కోర్టులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నరేందర్‌రెడ్డిని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఆయనను పోలీసులు ఏడు రోజుల కస్టడీకి కోరారు. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. వికారాబాద్‌లోని లగచర్లలో కలెక్టర్‌పై దాడి చేసిన ఘటనలో పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.