భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ బ్యాటింగ్లో తడబడుతోంది. భారత బౌలర్లు దాటీకి వెస్టిండీస్ లంచ్ బ్రేక్ సమయానికి 90/5 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో కాంప్బెల్(8), చంద్రపాల్(0), అథనాజ్(12), బ్రాండన్(13), హోప్(26) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా, బుమ్రా, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టారు.