బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో RCB సంచలన విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. జైస్వాల్ (49), ధ్రువ్ జురెల్ (47) రాణించిన విజయం అందించలేకపోయారు. RCB బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు తీశాడు.