»18th Match Pakistan Won Toss Chose To Bowling Defeat Australia
Australia vs Pakistan: బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్..ఆస్ట్రేలియాను ఓడిస్తుందా?
నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ICC ప్రపంచ కప్ 2023లో 18వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇక మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఈ మ్యాచులో గెలుస్తుందా లేదా అనే అంచనాలను ఇప్పుడు చుద్దాం.
18th match Pakistan won toss chose to bowling defeat Australia
ఈరోజు(అక్టోబర్ 20న) ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో 18వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్(Australia vs Pakistan) జట్లు పోటీపడుతున్నాయి. బెంగళూరు(bengaluru)లోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఇప్పటికే శ్రీలంకపై గెల్చిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ కూడా గెలవాలని చూస్తోంది. మరోవైపు పాకిస్తాన్ జట్టు సైతం ఈ ఆటలో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోంది. ఇక పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ 4 పాయింట్లతో మొదటి నాలుగవ స్థానంలో ఉండగా..ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది.
మరోవైపు గతంలో ఆస్ట్రేలియా ఇప్పటివరకు పాకిస్థాన్‌తో 107 వన్డేలు ఆడగా అందులో 69 విజయాలు సాధించింది. మూడు మ్యాచ్‌లు ఫలితాలు లేవు. ఒకటి టైగా ముగిసింది. పాకిస్తాన్ 34 గెలిచింది. ఇక చిన్నస్వామి స్టేడియంలో పిచ్ పేస్, స్పిన్ బౌలర్లు అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు సీనియర్ బ్యాటర్లు ఈ పిచ్‌ని ఆస్వాదిస్తూ పరుగులు చేస్తారని నిపుణులు పేర్కొన్నారు. గూగుల్(google) గెలుపు సంభావ్యత ప్రకారం ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచే అవకాశం 62% ఉందని తెలిపింది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.