ఢిల్లీ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత్, ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు, వెస్టిండీస్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా సాగనుంది.