క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులు విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తాడని అందరూ భావించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. కానీ టెస్టుల్లో మాత్రం సచిన్ 51 టెస్టు శతకాల రికార్డుకు కోహ్లీ(29) చాలా దూరంలోనే ఆగిపోయాడు. ఈ నేపథ్యంలో సచిన్ రికార్డులను కోహ్లీ అధిగమించడం అసాధ్యమని ఆసీస్ మాజీ స్టార్ ప్లేయర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు.