మరో రెండేళ్ల పాటు తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ అన్నాడు. మునుపటి కంటే ఇప్పుడే మరింత ఫిట్‌గా ఉన్నానని.. టీ20 ప్రపంచకప్-2026లోనూ ఆడతానని స్పష్టం చేశాడు. తమ కోచ్ డారెన్ సామీ తనను మరికొన్నాళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాల్సిందిగా కోరాడని.. అలాంటప్పుడు తాను జట్టుకు ఎందుకు దూరమవుతానని అన్నాడు. ఇప్పటికీ బంతిని అనుకున్న చోటుకు బాదగలనని తెలిపాడు.